ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటాం 

We are indebted to CM YS Jagan says Ravindrababu and Jakia Khanam - Sakshi

ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసినందుకు కృతజ్ఞతలు  

పండుల రవీంద్రబాబు, ఎం.జకియా ఖానమ్‌ 

కాకినాడ రూరల్‌/రాయచోటి: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

èఅధికారంలోకి రాగానే నేతలు తమ హామీలను మరిచిపోతుంటారు కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ తనను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసి ఎన్నికల ప్రచారమప్పుడు తనకిచ్చిన హామీని నెరవేర్చడం సంతోషం కలిగించిందని రవీంద్రబాబు పేర్కొన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి ముందుకు తీసుకువెళుతున్న వైఎస్‌ జగన్‌ వెంటే తానెన్నటికీ నడుస్తానన్నారు. 

► ముస్లిం మైనారిటీ మహిళగా ఉన్న తనకు గురుతర బాధ్యతగా అప్పగిస్తున్న పదవిని మహిళా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని, చట్ట సభలో ముస్లిం మైనార్టీ మహిళల తరఫున తన వాణిని వినిపిస్తానని జకియా ఖానమ్‌ చెప్పారు. తమ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వెంట నడుస్తూ రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top