కాంగ్రెస్‌కు ఊర్మిళ గుడ్‌బై

Urmila Matondkar Quits Congress Cites Lack Of Leadership - Sakshi

ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్భాటంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నటి ఊర్మిళా మటోండ్కర్‌ ఆరు నెలలు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఊర్మిళ రాజీనామాతో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ సీనియర్‌ నేత గోపాల్‌ శెట్టి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలకు తోడు నాయకత్వ లోపం​, అంతర్గత కలహాలతో విసిగి ఆ పార్టీకి రాజీనామా చేశానని ఊర్మిళ పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌ మిలింద్‌ దియోరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బహిర్గతం కావడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలో కొన్ని వర్గాలు పనిచేశాయని ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top