నాలుక్కరుచుకున్న ఉమా మాధవరెడ్డి..! | Uma Madhava Reddy Mistakenly Speaks About TDP While Campaigning | Sakshi
Sakshi News home page

ఉమా చర్యతో అవాక్కయిన గులాబీ తమ్ముళ్లు..!

May 3 2019 9:14 AM | Updated on May 3 2019 2:21 PM

Uma Madhava Reddy Mistakenly Speaks About TDP While Campaigning - Sakshi

సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరి అక్కడున్న వారందర్నీ షాక్‌కు గురిచేశారు.

సాక్షి, భువనగిరి : సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చర్యతో టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆమె తనయుడు అవాక్కయ్యారు. బొమ్మల రామారం జెడ్సీటీసీ అభ్యర్థిగా ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరపున ప్రచారం నిర్వహించిన ఉమా పొరపాటుగా మాట్లాడి నాలుక్కచురుకున్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కోరి అక్కడున్న వారందర్నీ షాక్‌కు గురిచేశారు. పక్కనే ఉన్న సందీప్‌రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు కారు గుర్తు అని సూచించడంతో తేరుకున్న ఆమె.. కారు గుర్తుకు ఓటేసి సందీప్‌రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరినా ఉమా మాధవరెడ్డి పాత పార్టీని మరచిపోనట్టున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

(చదవండి : టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement