మంత్రి గంటాకు ఆ దమ్ము ఉందా?

udivada Amarnath challenges minister ganta srinivasa rao - Sakshi

సాక్షి, విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసం గంటా ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.  గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ మంత్రి గంటా శ్రీనివాసరావు 420 కాదు, 840. ఆయన ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము గంటాకు ఉందా?.

లక్షల కోట్ల విశాఖ భూ కుంభకోణాల్లో ఆద్యుడు గంటానే. ఆ విషయాన్ని సహచర మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పారు. హుద్‌హుద్‌ తుఫానుతో విశాఖ అతలాకుతలమైతే గంటా ఎక్కడున్నారో ఎవరికీ తెలియదుజ అలాంటి గంటా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాజీనామాలపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రజల్లో చులకన అయిపోతున్నామని గ్రహించి టీడీపీ నేతలు డ్రామాలకు తెరలేపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ సీపీ పోరాటం అందరికీ తెలుసు. టీడీపీకి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు’ అని ధ్వజమెత్తారు.

Back to Top