అవిశ్వాసానికి టీఆర్‌ఎస్‌ మద్దతివ్వాలి | TRS should support for no confidence motion | Sakshi
Sakshi News home page

అవిశ్వాసానికి టీఆర్‌ఎస్‌ మద్దతివ్వాలి

Mar 18 2018 3:55 AM | Updated on May 29 2018 4:40 PM

TRS should support for no confidence motion - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి

మిర్యాలగూడ: పార్లమెంట్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతివ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యమం దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కదిలించిందన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కలసిరావాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను రద్దు చేయడం సరైందికాదన్నారు.

మే నెలాఖరులో బస్సు యాత్ర 
రాష్ట్రంలో మే ఆఖరులో వైఎస్‌ఆర్‌సీపీ బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉంటుందన్నా రు. బస్సు యాత్ర షెడ్యూల్, నిర్వహణ కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement