కాంగ్రెస్‌ ఓ ముసలి నక్క: కర్నె | TRS MLC Karne Prabhakar Slams Congress Leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఓ ముసలి నక్క: కర్నె

Feb 22 2018 3:59 AM | Updated on Mar 18 2019 9:02 PM

TRS MLC Karne Prabhakar Slams Congress Leaders - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ఓ ముసలి నక్క అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎడారిగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర పదవుల కోసం జరుగుతున్న రాజకీయ యాత్ర అని దుయ్యబట్టారు.

పచ్చి అబద్ధాలతో ఇప్పటి దాకా గాంధీభవన్‌కే పరిమితమైన కామెడీ షోలను ప్రజల ముందు ప్రదర్శించడానికి వెళ్తున్నారని, ఇలాంటి అబద్ధాలను, కాంగ్రెస్‌ నేతల ముసలి నక్క వేషాలను ప్రజలను నమ్మరని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరివ్వాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నామని చెప్పుకునేందుకు ప్రజల దగ్గరికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల యాత్రలతో ప్రజలకు ఒరిగిదేమీ లేదని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement