పార్టీ మారేందుకు సీనియర్లు చర్చలు: బలరాం

TDP MLA Karanam Balaram Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, ప్రకాశం : టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారేందుకు ఎవరికి వారు వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిని కరుణం బలరాం.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ది తన గురించి మాట్లాడే స్థాయి కాదని, తండ్రీకొడుకులు ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిందని హితవుపలికారు. పార్టీలో సీనియర్లకు కనీసం గౌరవందక్కడంలేదని, చంద్రబాబుది అవసరం ఉన్నప్పుడు వాడుకుని వదిలేసే తత్వమని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు)

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా ఆత్మసంతృప్తి పొందుతున్నారని సొంతపార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల పథకాలు భేష్ అని కితాబిచ్చారు. ఎంతో మంది నిపుణులు అమలు కష్టమన్న అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా తాగునీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం కారణంగానే వెలుగొండ ప్రాజెక్టు  నిర్మాణం ఆలస్యమైందని, రెండేళ్ల క్రితమే నీళ్లు ఇవ్వాల్సిందని గుర్తుచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top