ఫిరాయింపు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్‌..!

TDP Activists Opposing To Allocate Tickets To Sitting MLA Jawahar - Sakshi

నాలుగు సిట్టింగ్‌ స్థానాలపై తమ్ముళ్ల లొల్లి..!

సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. కొవ్వూరు, నిడదవోలు, పత్తిపాడు ఎమ్మెల్యే టికెట్లు సిట్టింగులకు కేటాయించొద్దని పార్టీ నేతలు అధిష్టాన్ని హెచ్చరించినట్టు సమాచారం. రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు స్థానాల పరిధిలో శనివారం అభ్యర్థుల ఎంపిక సమావేశం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై చర్చ సందర్భంగా.. కొవ్వూరు స్థానం మంత్రి జవహర్‌కు కేటాయించొద్దని తమ్ముళ్లు పట్టుబట్టారు. జవహర్‌ మద్యం, ఇసుక మాఫియాలో కూరుకుపోయాడని పార్టీ నాయకులు అదిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తమ మాటను లెక్కచేయక జవహర్‌కు టికెట్‌ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. ఇక, కాకినాడ పార్లమెంటు పరిదిలోని పత్తిపాడు ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు చంద్రబాబు టికెట్‌ నిరాకరికంచిట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో వరుపుల రాజాకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది.

నిడదవోలు పరిస్థితి కూడా అంతే..
నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటు ఇవ్వొద్దని స్థానిక నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ పెత్తనం ఎక్కువైందని, శేషారావు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరావుపై కూడా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అభ్యర్థిని మార్చాలని నేతలు డిమాండ్‌ చేశారు. నేతల విభేదాలతో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యుర్థుల ఎంపిక వాయిదా పడింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top