సుప్రీంకోర్టులో ములాయం కుటుంబానికి చుక్కెదురు

న్యూఢిల్లీ: ములాయం సింగ్ కుటుంబానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లకు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను దర్యాప్తు నివేదికలో పొందుపరచాలని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్, ప్రస్తుత దర్యాప్తు పత్రాలతో సహ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్నిసేకరించి రెండు వారాల్లో సీబీఐ తమ బాధ్యతను నిర్వహించాలని సూచించింది. కేసు దర్యాప్తును కోర్టుకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది వేసిన పిటిషన్‌ను విచారించిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి