మత విద్వేషాలను వ్యాప్తి చేస్తోంది | Sonia Gandhi lashes out at BJP | Sakshi
Sakshi News home page

మత విద్వేషాలను వ్యాప్తి చేస్తోంది

Apr 24 2020 5:28 AM | Updated on Apr 24 2020 5:28 AM

Sonia Gandhi lashes out at BJP - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిన బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ధ్వజ మెత్తారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో ఆమె మాట్లాడారు. ‘అందరం కలిసికట్టుగా కరోనా వైరస్‌పై పోరాటం చేయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. దీనిని అడ్డుకోవడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి’అని పిలుపునిచ్చారు. ‘లాక్‌డౌన్‌ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించాలి. కోవిడ్‌తో తలెల్తిన సమస్యల పరిష్కారంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలి’ అని ప్రభుత్వాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement