బతుకమ్మ చీరల పేరిట రూ.150 కోట్ల స్కాం   

Rs 150 crore scam in the name of batu kamma saris - Sakshi

అభద్రత భావంతోనే కేంద్ర సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌

జగిత్యాలటౌన్‌ : నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ చీరల పేరిట రూ. 150 కోట్ల స్కాం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు సాధించిందుకు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్‌ నుంచి జగిత్యాల వరకు 104 వాహనాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జగిత్యాలకు చెందిన బీజేపీ నాయకులు మంచినీళ్ల బావి వద్ద ఘనస్వాగతం పలికారు.

అనంతరం స్థానిక దేవిశ్రీగార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌ అభద్రత భావంతోనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనీయడం లేదన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కాదని కమీషన్ల కవిత అని ఆరోపించారు. ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలోనే బీజేపీని ఆదరిస్తారని, దక్షిణ భారతదేశంలో బీజేపీకి పట్టు లేదని విపక్షాల ఆరోపణలకు కర్ణాటక ఫలితాలు తేటతెల్లం చేశాయన్నారు.

2014 ఎన్నికల తర్వాత 15వ రాష్ట్రంగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో  మోడీ ప్రభంజనాన్ని ఏ దొర ఆపలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజీ భాస్కర్, నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి, నాయకులు సాజిద్, బస్వ లక్ష్మినారాయణ, మారంపల్లి శ్రీనివాస్, పల్లె గంగాధర్, గోపాల్, యాదగిరిబాపు,  సీపెల్లి రవీందర్, ఆముదరాజు, ఆన్‌కార్‌ సుధాకర్, లింగంపేట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top