‘దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ జీరో’ | Ponnam Prabhakar Comments On KCR In Karimnagar | Sakshi
Sakshi News home page

‘దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ జీరో’

Mar 3 2019 1:11 PM | Updated on Mar 18 2019 9:02 PM

Ponnam Prabhakar Comments On KCR In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఫెడరల్ ఫ్రంట్, తృతీయ ఫ్రంట్ అంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్ర జీరో అని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాయమాటల్లో పడి తెలంగాణకు అన్యాయం చేయవద్దని కోరారు. 

పార్లమెంటు ఎన్నికలు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ కోసం సాధించిందేంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  ఏమి సాధించారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement