‘రాష్ట్ర సమీకరణాల ఆధారంగానే పొత్తులు’

Poll Alliances Depends On State Level Situation Says Sitaram Yechury - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి సమీకరణాల ఆధారంగానే ఎన్నికల పొత్తులను పార్టీ నిర్ణయిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రెండు రోజుల పొలిట్‌ బ్యూరో సమావేశం అనంతరం శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహాగఠ్‌బంధన్‌లో ముందస్తు కూటమి సాధ్యం కాదు. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే మా ఎన్నికల వ్యూహాలు ఉంటాయి’అని సీతారాం స్పష్టం చేశారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్న దానిపై పార్టీకేంద్ర కమిటీ మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించే సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించడమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని, లోక్‌సభలో సీపీఎంను బలోపేతం చేసి కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top