స్పేస్‌ సూపర్‌ పవర్‌గా భారత్‌: మోదీ

PM Narendra Modi addressing  The Nation - Sakshi

కీలక ప్రకటన అంటూ బీపీ పెంచిన ప్రధాని

భారత్‌ స్పేస్‌ సూపర్‌ పవర్‌గా అవతరించింది - మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం జాతి నుద్దేశించి ప్రసంగించారు. ముందుగానే కీలక ప్రకటన చేయనున్నానని  మోదీ ప్రకటించిన  సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ ప్రపంచంలో అంతరిక్ష రంగంలో సత్తా చాటిన భారతదేశం స్పేస్ సూపర్‌ పవర్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా  దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, రష్యా , చైనా తర్వాత భారత్ స్పేస్ సెంటర్‌గా ఎదిగిందన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని పేర్కొన్నారు. దేశ భద్రత, టెక్నాలజీ ఎచీవ్‌మెంట్‌లో యాంటి శాటిలైట్‌ వెపన్‌ ఒక  మైలురాయిలాంటిదన్నారు. 

యాంటీ శాటిలైట్ వెపన్ ఏ-ఎస్‌ఏటీ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లో లైవ్ శాటిలైట్‌ను కూల్చేశామని ప్రకటించిన మోదీ  'మిషన్ శక్తి' ఆపరేషన్‌ను మూడు నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ధన్యావాదాలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే యాంటీ శాటిలైట్ వెపన్‌ను రూపొందించామన్నారు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది. అంతమాత్రాన తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నానన్నారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినతరమైన ఆపరేషన్ అన్నారు. అయతే దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పించడం తమ  ఉద్దేశం కాదన్నారు.

చదవండి : సంచలనం రేపుతున్న ప్రధాని మోదీ ట్వీట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top