breaking news
drda staff
-
స్పేస్ సూపర్ పవర్‌గా భారత్: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం జాతి నుద్దేశించి ప్రసంగించారు. ముందుగానే కీలక ప్రకటన చేయనున్నానని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ ప్రపంచంలో అంతరిక్ష రంగంలో సత్తా చాటిన భారతదేశం స్పేస్ సూపర్ పవర్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, రష్యా , చైనా తర్వాత భారత్ స్పేస్ సెంటర్‌గా ఎదిగిందన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని పేర్కొన్నారు. దేశ భద్రత, టెక్నాలజీ ఎచీవ్‌మెంట్‌లో యాంటి శాటిలైట్ వెపన్ ఒక మైలురాయిలాంటిదన్నారు. యాంటీ శాటిలైట్ వెపన్ ఏ-ఎస్ఏటీ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్‌లో లైవ్ శాటిలైట్‌ను కూల్చేశామని ప్రకటించిన మోదీ 'మిషన్ శక్తి' ఆపరేషన్‌ను మూడు నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ధన్యావాదాలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే యాంటీ శాటిలైట్ వెపన్‌ను రూపొందించామన్నారు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది. అంతమాత్రాన తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నానన్నారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినతరమైన ఆపరేషన్ అన్నారు. అయతే దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. చదవండి : సంచలనం రేపుతున్న ప్రధాని మోదీ ట్వీట్ -
సదరం క్యాంపులో గందరగోళం
మహబూబాబాద్ :మానుకోటలో బుధవారం జరిగిన సదరం క్యాంపు వద్ద గందరగోళం నెలకొంది. రోజూ 150 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేల సంఖ్యలో వికలాంగులు క్యాంపునకు హాజరయ్యారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి సిబ్బంది చేతులెత్తేశారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 1 నుంచి సదరంక్యాంపు ని ర్వహిస్తున్నారు. మానుకోట, నర్సంపేట డివి జన్లకు సంబంధించిన వికలాంగులు ఈ క్యాంపునకు హాజరవుతున్నారు. 11 రోజులుగా క్యాంపు ఎలాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగింది. అరుుతే ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పరీక్షలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సిబ్బందివారికి ప్రత్యేకంగా స్లిప్‌లను పంపిణీ చేశారు. బుధవారం వచ్చేందుకు మానుకోట పట్టణంలో 50 మందికి, మండలంలోని ఇతర గ్రామాల్లో 100 మందికి స్లిప్‌లు పంపిణీ చేశారు. అరుుతే ఆ స్లిప్లపాటు నకిలీ స్లిప్‌లు కూడా పెద్ద సంఖ్య లో పంపిణీ అయ్యాయి. ఆ స్లిప్‌లతో శిబిరానికి వందలాదిగా వచ్చిన వికలాంగులు తమకు పరీక్షలు నిర్వహించాలని ఆందోళనకు దిగారు. వారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పోలపాక మల్లయ్య, సురుగు ఐలయ్య, గార్లపాటి వెంకటేశ్వర్లు, తోట బిక్షం, దుగ్గి సారయ్య మాట్లాడుతూ క్యాంపును పొడగించాలని, వికలాంగులకు సదుపాయాలు కల్పించాలని, అర్హులైన వారందరికి సదరం స ర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ మల్లయ్య, మునిసిపల్ కమిషనర్ రాజలింగు అక్కడికి చేరుకుని డీఆర్డీఏ కేవలం 150 స్లిప్పులు మాత్రమే పంపిణీ చేసిందని, మిగతా కార్డులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. సదరం క్యాంపు నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లతోపాటు పింఛ న్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిగతావారిని తిరిగి ఇంటికి పంపిం చారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిలువనీడ లేక వికలాంగులు ఎండలో కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా నకిలీ స్లిప్‌లు తయారు చేసిన వారిపై అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఐకేపీ ఏపీఎం శంకర్ తెలిపారు.