మీ వల్లే నేను ఓడిపోయా: పవన్‌ 

Pawan Kalyan fury on Janasena Party Cadre At Mandapeta - Sakshi

జనసేన కార్యకర్తలపై పవన్‌ కల్యాణ్‌ అసహనం

సాక్షి, మండపేట: ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అసహనం వ‍్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో నిన్న (ఆదివారం) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు అండ్‌ బాబు కన్వెన్షన్‌ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్‌ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు.

దీంతో పవన్‌ స్పందిస్తూ...కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అవరొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల మొదటి మూడు రోజుల్లోగా ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుంటే కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top