బీజేపీ కూటమికి రెబెల్స్‌ బెడద

Parties try to get rebels to withdraw from fray - Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి రెబెల్స్‌ బెడద ఎక్కువగా ఉంది. ఈ నెల 21న పోలింగ్‌ జరిగే ఈ ఎన్నికల్లో సోమవారంతో నామినేషన్‌ గడువు ముగిసింది. బీజేపీ, శివసేనలు ఆఖరి నిమిషం వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 50కిపైగా చోట్ల 100 మందికి పైగా అభ్యర్థులు బీజేపీ–సేన కూటమికి సవాళ్లు విసురుతున్నారు.  కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమికి 15–20 స్థానాల్లో రెబెల్స్‌ బెడద ఉంది.  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా వినే పరిస్థితి లేదు. రెబెల్స్‌ను శాంతింపజేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా ఫలితం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top