వివేకం కోల్పోయావా వివేక్‌?

NCW Issues Notice To Vivek Oberoi Over Disgusting Election Meme - Sakshi

వివేక్‌ ట్వీట్‌పై భగ్గుమన్న నెటిజన్లు

స్త్రీలను గౌరవించటం నేర్చుకో అంటూ విసుర్లు..

ముంబై: సోషల్‌ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్‌ షేర్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే దేశం యావత్తు ఉలిక్కిపడేలా ప్రకంపనలు రేగుతాయి. ఇలాంటి ట్విట్టర్‌ దుమారమే మరోసారి చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్, ఐశ్వర్యరాయ్‌ను కించపరిచేలా ఉన్న ఒక మీమ్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీనిలో సల్మాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోకు ఒపీనియన్‌ పోల్, వివేక్‌–ఐశ్వర్య చిత్రానికి ఎగ్జిట్‌ పోల్, అభిషేక్, ఆరాధ్య, ఐశ్వర్య కలిసి ఉన్న చిత్రానికి రిజల్ట్‌ అని టైటిల్‌ ఇచ్చి, ఈ  మూడు చిత్రాలతో కూడిన మీమ్‌ను రూపొందించారు.  ‘హ..హ.. క్రియేటివ్, రాజకీయాల్లేవు, కేవలం జీవితం’ అని టైటిల్‌తో దీనిని వివేక్‌  ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.  కొద్ది వ్యవధిలోనే ఈ పోస్ట్‌  వైరల్‌గా మారి నెటిజన్లను మండిపాటుకు గురిచేసింది.  

అతని స్థాయిని సూచిస్తోంది
ఈ ట్వీట్‌ అసహ్యంగా ఉందంటూ నటి సోనమ్‌ కపూర్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, పలువురు మహిళా జర్నలిస్టులు, ప్రముఖులు ట్విట్టర్‌లో స్పందించారు. వివేక్‌కు నోటీసులు పంపుతామన్నారు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌. అతని నీచ బుద్ధిని.. అతను  జీవితంలోను, రాజకీయాల్లోను  సమర్థుడు కాదని తేల్చడానికి ఇదే సాక్ష్యం అంటూ ట్వీట్‌ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top