ములాయం స్టార్‌ క్యాంపెయినర్‌ కాదా?

Mulayam Singh Yadav Missing On Samajwadi Party List Of Campaigner - Sakshi

ప్రచార జాబితాలో లేని ఎస్పీ వ్యవస్థాపకుడి పేరు

తర్వాత తప్పుదిద్దుకున్న పార్టీ

లక్నో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్‌ యాదవ్‌ పేరు లేకుండానే శనివారం ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. సిట్టింగ్‌ స్థానం అయిన ఆజంగఢ్‌ నుంచి ఈసారి ములాయం కొడుకు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బరిలో నిలవనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శనివారం 40 మంది నేతలతో కూడిన ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. ఇందులో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్‌తోపాటు నేతలు ఆజంఖాన్, రామ్‌గోపాల్, జయా బచ్చన్‌ తదితరుల పేర్లున్నాయి. ములాయం పేరు లేదు. పొరపాటును గుర్తించిన పార్టీ నాయకత్వం వెంటనే ఆ జాబితాలో ఆయన పేరును చేర్చి మరో లిస్టును ఎన్నికల సంఘానికి పంపించింది..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top