2019 ఎన్నికల నాటికి కొత్త పార్టీ: ఆర్‌.కృష్ణయ్య  | MLA R Krishnaiah Says New Party Establish To 2019 Assembly Elections | Sakshi
Sakshi News home page

2019 ఎన్నికల నాటికి కొత్త పార్టీ: ఆర్‌.కృష్ణయ్య 

May 26 2018 1:42 AM | Updated on May 26 2018 1:42 AM

MLA R Krishnaiah Says New Party Establish To 2019 Assembly Elections - Sakshi

ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు రాజ్యాధికారం కోసం 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం వినాయక నగర్‌లో నిర్వహించిన గ్రేటర్‌ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం సీట్ల కేటాయింపుతోపాటు పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు నరేశ్‌బాబు, భూపేష్‌ సాగర్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement