మంత్రి పదవికి సోమిరెడ్డి అనర్హుడు

Mla Kakani Govardhan Reddy Criticize Minister Somireddy - Sakshi

ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం(ముత్తుకూరు): రైతులకు మేలు చేయడంలో పూర్తిగా విఫలమైన సోమిరెడ్డి మంత్రి పదవికి అనర్హుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ముత్తుకూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మండలంలో ఎంత మేరకు దిగుబడులు వచ్చాయని, ఎన్ని పుట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారం 55 వేల పుట్ల ధాన్యం దిగుబడులు రాగా, 50 పుట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వ్యవసాయాధికారి హరికరుణాకర్‌రెడ్డి, ఏపీఎం విజయలక్ష్మి చెప్పారు. ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించగా, మిల్లర్ల నుంచి అనుమతుల్లేకపోవడంతో పరిస్థితి ఏర్పడిందని బదులిచ్చారు. వరుసగా నాలుగేళ్లగా 30 వేల నుంచి 40 వేల పుట్ల ధాన్యాన్ని తాము పనిచేసిన చోట కొనుగోలు చేశామని, ఈ ఏడాదే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ సందర్భంగా కాకాణి విలేకరులతో మాట్లాడారు. వ్

యవసాయ మంత్రిగా జిల్లాకు చెందిన సోమిరెడ్డి ఉండటంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని మోసపోయారని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దిగజారిపోయాయని కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది చెప్తున్నారన్నారు. జిల్లా చరిత్రలో ఎంతో మంది మంత్రి పదవులు చేపట్టారని, అయితే సోమిరెడ్డిలాగా విఫలమైన వారు ఎవరూ లేరన్నారు. మిల్లర్లకు దోచిపెట్టేలా ఉత్తర్వులను విడుదల చేయించి వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. విరుగుడు ధాన్యం కొనుగోలుతో పాటు విరగని ధాన్యానికి అదనంగా రూ.630ను మిల్లర్లకు ఇచ్చేలా సోమిరెడ్డి ఉత్తర్వులు ఇప్పించడంలో తర్యమేమిటని ప్రశ్నించారు.

సోమిరెడ్డికి భారీ మద్దతు ధర లభించిందని విమర్శించారు. తానే వ్యవసాయ మంత్రిగా ఉండి విఫలమైతే స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేసేవాడినని, రైతుల కడుపుకొట్టి మిల్లర్లకు చిపెట్టడం సోమిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని అభివర్ణించారు. జిల్లాలో 25 లక్షల టన్నుల ధాన్యం అధికారిక లెక్కల ప్రకా రం దిగుబడులు రాగా, కేవలం లక్ష టన్నులను మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం మంత్రిగా వైఫల్యం కాదానని ప్రశ్నించారు. రైతులకు ఉపయోగపడని ఉత్తర్వులు ఎందుకని వాటికి నిప్పంటించారు. పార్టీ మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ శివప్రసాద్, పార్టీ జిల్లా నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, లక్ష్మణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top