సీఎం మాటలు ఉత్తుత్తే!

MLA Gummanuru Jayaram Criticize On Chandrababu Naidu - Sakshi

హొళగుంద: నియోజకవర్గంలో వేదావతి నదిపై ప్రాజెక్ట్‌ నిర్మాణం , దేవరగట్టులో జింకల పార్కు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. గురువారం హొళగుంద, నాగరకణ్వీ గ్రామాల్లో జరిగిన  వివాహ కార్యక్రమాలకు  వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అరికెర సభలో వేదావతి నదిపై ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం సర్వేకు రూ.250 కోట్లు విడుదల చేస్తానని పైసా కూడా వెచ్చించలేదన్నారు. దాదాపు నాలుగేళ్లు దాటి పోయినా నేటి వరకు అవే హామీలు, అబద్దాలు చెబుతూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకునే చిత్తశుద్ది టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు.

పట్టిసీమా వల్ల ప్రయోజనం లేదని,  పోలవరం ప్రాజెక్ట్‌ కూడా వైఎస్‌ రాజశేఖ్‌రెడ్డి పాలనలోనే సగం పూర్తియితే నాలుగేళ్లయినా  మిగిలిన దాన్ని పూర్తి చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు బాగు పడాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు  అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

అలాగే ఈ నెల 8న వేదావతి నది నుంచి చేపట్టే పాదయాత్ర, గూళ్యంలో జరిగే ధర్నాకు పార్టీశ్రేణులు, రైతులు, కార్యాకర్తలు పెద్ద ఎత్తున తరలి విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు,  హొళగుంద, హాలహర్వీ మండలాల కన్వీనర్‌లు షఫియుల్లా, బీమప్పచౌదరి, ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, గజ్జెళ్లీ కెంచప్ప, నాయకులు పాల్తూరు గోవిందు,  కుమారస్వామి, రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ అయ్యాళప్ప, ఉప సర్పంచ్‌ జెండే శేకన్న, మారుతి, కిష్టప్ప, ఆటోమల్లి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top