‘స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తా’

MK Alagiri Says Ready To Accept Stalin As Leader - Sakshi

చెన్నై: డీఎంకే బహిషృత నేత, కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి తన దూకుడు తగ్గించారు. నిన్నటి వరకు సోదరుడు స్టాలిన్‌పై విరుచుకుపడ్డ అళగిరి తన వైఖరి మార్చుకున్నారు. తాను స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను తిరిగి డీఎంకేలో చేర్చుకుంటే స్టాలిన్‌ను నాయకుడిగా అంగీకరిస్తానని స్పష్టం చేశారు. అలాగే తను డీఎంకేలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా మంగళవారం జరిగిన డీఎంకే అధ్యక్ష ఎన్నికల్లో స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

డీఎంకే అధ్యక్ష ఎన్నికకు కొన్ని రోజుల ముందు అళగిరి మాట్లాడుతూ.. తనను మళ్లీ డీఎంకేలోకి చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్టాలిన్‌ను హెచ్చరించారు. లేకుంటే సెప్టెంబర్‌ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తనా సత్తా ఎంటో  చూపిస్తానని అన్నారు. పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. తాజాగా అళగిరి తన వైఖరి మార్చుకోవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top