కేంద్రంపై హరీశ్‌రావు ఆగ్రహం

Minister Harish Rao Outraged Over Central Government Policies - Sakshi

సాక్షి, సంగారెడ్డి/ మునిపల్లి (అందోల్‌): ఆఫ్రికా నుంచి కందులు దిగుమతి చేసుకోవడం ఏమిటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణంకోసం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు్తన్న ఎగుమతి, దిగుమతుల విధానంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ‘కొరత ఉంటే దిగుమతి చేసుకోవాలి, కానీ మన రైతులే అద్భుతంగా వివిధ రకాల పంటలు పండిస్తుంటే ఇక దిగుమతి ఎందుకు’అని ప్రశ్నించారు. కందులను తెలంగాణ రైతులు బాగా పండిస్తున్నారని ప్రశంసించారు.
(చదవండి: క‘రోనా’ పార్టీ)

అంతే కాకుండా నాణ్యమైన పత్తిని పండిస్తున్నారని, పంట వేసే సమయంలో ధర ఒకరకంగా, ఆ తర్వాత పంట చేతికి వచ్చాక మరో రకంగా ఉండడంతో రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కందులు, పత్తి పంటకు వచ్చే లాభం రైతులకే చెందాలన్నారు. పరిశ్రమలకు, దళారులకు లాభం.., రైతులకు నష్టం వచ్చే విధానాలను రద్దు చేయాలన్నారు. అనంతరం మంత్రి సంగారెడ్డి కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోగా డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లేకపోతే సంబంధిత గ్రామాల సర్పంచులు, కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. పనుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమతో చెప్పాలని సూచించారు. 

కరోనా పేషెంట్లకు హరీశ్‌ ఫోన్‌ 
కరోనా రోగులకు మనోధైర్యాన్ని ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ చాంబర్‌లో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా కేసుల వివరాలు, పాజిటివ్‌ పేషెంట్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాల వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, హోం ఐసోలేషన్‌లో ఉన్న కొందరు రోగులతో మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. పాజిటివ్‌గా తేలి ఎన్ని రోజులైంది, చికిత్స తీసుకుంటున్నారా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారా. వైద్యులు, సిబ్బంది తరచుగా వచ్చి పరీక్షలు చేస్తున్నారా. అని వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైద్య సిబ్బంది బాగానే స్పందిస్తున్నారని, అన్ని విధాలా తమకు ధైర్యం చెబుతూ చికిత్స చేస్తున్నారని రోగులు మంత్రికి వివరించారు. ఏదైనా అసవరం ఉంటే తనకు ఫోన్‌చేయాలని హరీశ్‌రావు వారికి సూచించారు.   
(కరోనాపై ఆందోళన వద్దు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

10-08-2020
Aug 10, 2020, 10:07 IST
సాక్షి, యాదాద్రి : కరోనా బాధితులకు జిల్లా స్థాయిలోనే వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా స్థానిక పరిస్థితులు...
10-08-2020
Aug 10, 2020, 09:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ...
10-08-2020
Aug 10, 2020, 08:48 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా బాధితుల ప్రాణాలు నిలిపేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా...
10-08-2020
Aug 10, 2020, 07:19 IST
తాండూరు: గర్భంతో ఉన్న ఆశ వర్కర్‌కు కరోనా వైరస్‌ సోకినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి ఆమెకు...
10-08-2020
Aug 10, 2020, 06:14 IST
తూర్పు దిక్కున వెలుగును చిదిమేస్తూ ఎగసిపడిన అగ్నికీలలతో బెజవాడ భీతిల్లింది.. దట్టంగా అలుముకున్న పొగ ఊరంతా గాఢ నిద్రలో ఉన్న...
10-08-2020
Aug 10, 2020, 06:02 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వైరస్‌ పరిస్థితులను అంచనా వేసేందుకు నిర్వహించనున్న సీరో సర్వైలెన్స్‌ ద్వారా మహమ్మారి ఉధృతం, విస్తరణ...
10-08-2020
Aug 10, 2020, 02:22 IST
కరోనా తర్వాత సగంలో ఆగిపోయిన సినిమాలను మళ్లీ మొదలుపెట్టడంతోపాటు కొత్త సినిమాలను కూడా ప్రకటించింది మాలీవుడ్‌.
09-08-2020
Aug 09, 2020, 20:08 IST
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,820 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
09-08-2020
Aug 09, 2020, 19:51 IST
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కొద్దిరోజులుగా జ్వరం...
09-08-2020
Aug 09, 2020, 17:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో క‌రోనా వైర‌స్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రికవరీ కేసుల్లో త‌గ్గుద‌ల...
09-08-2020
Aug 09, 2020, 12:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ తెలియజేశారు....
09-08-2020
Aug 09, 2020, 12:31 IST
న్యూఢిల్లీ: పాపడ్‌ తింటే క‌రోనా పోతుంద‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చి విమ‌ర్శ‌ల‌పాలైన‌ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ ఇప్పుడ‌దే వైర‌స్ బారిన ప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న‌కు...
09-08-2020
Aug 09, 2020, 11:02 IST
కాలిఫోర్నియా : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా...
09-08-2020
Aug 09, 2020, 10:17 IST
సాక్షి, ఢిల్లీ : దేశంలో క‌రోనా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్త‌గా 64,399 క‌రోనా పాజిటివ్‌ కేసులు...
09-08-2020
Aug 09, 2020, 08:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆదివారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌...
09-08-2020
Aug 09, 2020, 08:27 IST
సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి జీవితంలో ఎన్నడూ చూడని అమానవీయ సంఘటనల్ని మన కళ్లముందుంచింది. కరోనా వైరస్‌...
09-08-2020
Aug 09, 2020, 08:14 IST
సాక్షి, హైదరాబాద్ ‌: వర్క్‌ ఫ్రం హోం లేదా రిమోట్‌ వర్కింగ్‌.. ఇప్పుడు ఎవరు కలుసుకున్నా, ఫోన్లో పలకరించుకున్నా ఇవే...
09-08-2020
Aug 09, 2020, 04:30 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకుని శనివారం ఒకే రోజు 9,151 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో...
09-08-2020
Aug 09, 2020, 03:51 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఉపముఖ్యమంత్రి,...
09-08-2020
Aug 09, 2020, 03:46 IST
వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top