జమిలి ఎన్నికలు.. వివిధ పార్టీల అభిప్రాయం ఇదే!

Law Commission discussed simultaneous elections with political parties - Sakshi

జమిలీ ఎన్నికలపై తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, అన్నాడీఎంకే స్పందన

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రంలోని లోక్‌సభకు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రాతిపదనపై లా కమిషన్‌ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యపడబోవని అభిప్రాయపడ్డాయి. లా కమిషన్‌తో సమావేశమైన తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, గోవా ఫార్వర్డ్‌ పార్టీల నేతలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు.

జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు సాధ్యం కావు అని, రాజ్యాంగపరంగా ఇది వీలు కాదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బేనర్జీ అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని గోవా ఫార్వర్డ్‌ పార్టీ నేత విజయ్‌ సర్దేశాయ్‌ పేర్కొన్నారు. ఇక, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జమిలి ఎన్నికలపై ఒకింత భిన్నంగా స్పందించింది. జమిలి ఎన్నికలు 2019లో సాధ్యం కావని, అదే 2024లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు తాము సిద్ధమని పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top