‘డిసెంబర్‌ 11న గూబ గుయ్‌మనే శబ్దం వస్తుంది’

KTR Election Campaign In jagtial - Sakshi

సాక్షి, జిగిత్యాల : గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి  నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిందని  టీఆర్‌ఎస్‌ నేత, అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం ఆయన జగిత్యాలలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెబుతున్నట్లు నిశ్శబ్ద విప్లవం లేదని, కచ్చితంగా శబ్ద విప్లవమే ఉంటుందని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 11న( ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తెలంగాణలో కూటమి గూబ గుయ్‌మనే శబ్దం వస్తుందని ఎద్దేవా చేశారు.

24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్‌ వైపు ఉంటారో.. 67ఏళ్లు కరెంటు ఇవ్వకుండా కాల్చుకుతిన్న కాంగ్రెస్‌ వైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌, టీడీపీ చేతికి పోతే కరెంటు ఉండదని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తికావని తెలిపారు. తెలంగాణ బంగారం, వ్యవసాయం పండుగ అయ్యేవరకూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిద్రపోదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా ?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top