డీలర్లే ప్రభుత్వాన్ని తొలగిస్తారు: కోమటిరెడ్డి | Komati reddy venkata reddy on ration dealers strike | Sakshi
Sakshi News home page

డీలర్లే ప్రభుత్వాన్ని తొలగిస్తారు: కోమటిరెడ్డి

Jun 29 2018 2:33 AM | Updated on Jun 29 2018 2:33 AM

Komati reddy venkata reddy on ration dealers strike  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కమీషన్‌ పెంచాలని డీలర్లు సమ్మె చేస్తే వారిని తొలగించాలని చూస్తున్న ప్రభుత్వాన్ని ఆరునెలల తర్వాత అధికారంలో నుంచి డీలర్లే తొలగిస్తారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేషన్‌ డీలర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

అదేవిధంగా రూ.410 కోట్ల బకాయిలను తక్షణం చెల్లించాలని, డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. 17 వేల మంది రేషన్‌ డీలర్లు సమస్యల పరిష్కారం కోసం ఎంతో కాలంగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించకుండా రేషన్‌ డీలర్లకు నోటీసులు పంపడం నియంత పోకడలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement