నా కొడకల్లారా... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం

JC Prabhakar Reddy Threats to Party Activists Anantapur - Sakshi

పార్టీ మారిన కార్యకర్తలను బెదిరించిన

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి: ‘రేయ్‌ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా... నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా... మీరు పోవాలా నా కొడకల్లారా.... మీ లారీలు అన్ని తిరుగుతాయా... రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. ఇన్నాళ్లూ వెంట ఉన్న వారంతా ఇప్పుడు తనను వీడి పోతున్నారన్న అక్కసుతో వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆదివారం ఉదయం పార్టీ మారిన వారంతా రాత్రి తిరిగి పచ్చకండువా కప్పుకోక తప్పలేదు. వివరాల్లోకి వెళితే..  కర్నూలు జిల్లా కనకాద్రిపల్లికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి జేసీ సోదరుల అండతో తాడిపత్రిలో గ్రానైట్‌ రవాణా చేసేవాడు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలకు బ్రేక్‌పడుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఇంతకాలం వారి పంచన ఉంటూ బానిసలుగా బతికిన వారు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వీడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రభాకరరెడ్డి....ఎలాగైనా తనను కాదని పోతున్న వారిని బెదిరించి తిరిగి టీడీపీ కండువా కప్పే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆదివారం గ్రానైట్‌ వ్యాపారి సుబ్బారావుకు జేసీ ప్రభాకరరెడ్డి ఫోన్‌ చేసి బెదిరించాడు. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టారు. దీంతో సదరు సుబ్బారావు  ‘అయ్యా వస్తాలే’ అని చెప్పి...మరో టీడీపీ కార్యకర్త కొనంకి రమేష్‌నాయుడుతో కలిసి వెంటనే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. వారు కనిపించగానే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి బూతులతో వారిపై విరుచుకుపడ్డాడు. తనను కాదని వెళ్తే అంతేనంటూ బెదిరించాడు. దీంతో వారు తిరిగి పచ్చకండువా కప్పుకుని ఆయన పంచన చేరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top