‘చంద్రబాబు నక్క.. యనమల గుంట నక్క’

Dadisetti Raja Slams On Chandrababu And Yanamala In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్‌ టెర్రరిస్టు అని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా  విమర్శించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఒక నక్క అయితే.. ఆయన పక్కన ఉండే యనమల రామకృష్ణుడు గుంటనక్క అని రాజా మండిపడ్దారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే దాన్ని కూడా టీడీపీ వక్రీకరిస్తోందని అయన దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు తండ్రిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో.. సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి నెర్చుకోవాలని అయన అన్నారు. చంద్రబాబు సీఎం జగన్‌పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజా ధ్వజమెత్తారు. శాసన మండలిలోకి టీడీపీ ఎలాంటి వారిని తీసుకువచ్చిందో అందరికీ తెలుసని తెలిపారు. (పన్నులు కట్టేది.. చంద్రబాబు బినామీల కోసం కాదు)

వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవుల్నిపొందిన చరిత్ర చంద్రబాబుదనాయుడిదని రాజా ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష అని రాజా ప్రశ్నించారు. మరో ఆరు నెలల్లో చంద్రబాబు పక్కన 21 ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో తెలుసుకోవాలన్నారు. యనమల రామకృష్ణుడు గతంలో మంత్రిగా పని చేసినప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని రాజా ఆరోపించారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు  స్పిన్నింగ్ పనులు చేయిస్తానని చెప్పి రూ. 25 కోట్లు వసూళ్లు చేశాడని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. 

‘ఎదుటవారికి నీతులు చెప్పడానికే.. కానీ వాటిని ఆచరించడానికి కాదు’ అన్న చందంగా యనమల రామకృష్ణుడి తీరు ఉందని రాజా ఫైర్‌ అయ్యారు. ముందు చంద్రబాబు రాజీనామా చేయాలని రాజా డిమాండ్‌ చేశారు. విజయవాడ దుర్గగుడి  ఫ్లైఓవర్ నిర్మాణం తమ ప్రభుత్వం హయాంలో పూర్తి చేయబోతున్నామని రాజా స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top