కొత్త ప్రయోగం ఫలించేనా ? 

CPM-BLF alternate mechanisms will workout or not - Sakshi

సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ ప్రత్యామ్నాయ విధానాలతో లబ్ధి చేకూరేనా? 

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు, సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా సీపీఎం–బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశాయి. మరో రెండురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ కొత్త రాజకీయ ప్రయోగం ఏ మేరకు ఆశించిన ఫలితాలనిస్తుందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎన్నికలకు ముందే తమ ఎజెండాపై చర్చ జరిగేలా చేయడంతో పాటు వివిధ సామాజికవర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను తీసుకురాగలగడం తమ విజయంగా బీఎల్‌ఎఫ్‌ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు సందర్భంగా అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారనే చర్చకు తీసుకువచ్చామని అంటున్నారు. కొంతకాలంగా బీఎల్‌ఎఫ్‌ను ప్రచారంలోకి తెచ్చినా విస్తృతప్రాతిపదికన ఇతర వామపక్షాలు, సంఘాలు, సంస్థలతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయలేకపోవడం ఒక వైఫల్యంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయపార్టీలు ఇస్తున్న హామీలు, ఆర్థికంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ ఫలాలు, పథకాలపై చేస్తున్న వాగ్దానాలకు భిన్నంగా ప్రత్యామ్నాయ విధానాలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది చర్చనీయాంశమవుతోంది.  

107 సీట్లలో బీఎల్‌ఎఫ్‌ పోటీ...  
సీపీఎం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు,స్వచ్ఛందసంస్థలతో ఏర్పడిన బీఎల్‌ఎఫ్‌ మొదటిసారిగా మొత్తం 107 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో తాము ప్రధాన పాత్రపోషిస్తామని బీఎల్‌ఎఫ్‌ చెబుతోంది. ఈ ఎన్నికల్లో సీపీఎంగా 26 స్థానాల్లో, బీఎల్‌ఎఫ్‌ పక్షాన 81 సీట్లలో పోటీలో ఉన్నారు. తెలంగాణలో 90% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలదే కావడంతో, ప్రస్తుత ఎన్నికల్లో 52 శాతమున్న బీసీలకు 50.4% సీట్లు, 18 శాతమున్న ఎస్సీలకు 23.5% (జనరల్‌ సీట్లలోనూ ఇచ్చారు), 10 శాతమున్న ఎస్టీలకు 12.6 %(జనరల్‌ సీట్లలోనూ ఇచ్చారు), 12 శాతమున్న మైనారిటీలకు 8.5%, 7 శాతమున్న ఓసీలకు 5.5% సీట్లు కేటాయించారు. రాష్ట్రచరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌ జెండర్‌కు కూడా టికెట్‌ను కేటాయించి అందరి దృష్టిని ఆకర్షించారు.  

గెలిచే అవకాశాలు అంతంతే 
గతంలో గెలిచిన భద్రాచలం(ఎస్టీ), మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, పార్టీ పరంగా బలమున్న వైరా, పాలేరు, తదితర నియోజకవర్గాల్లో విజయావకాశాలున్నట్టుగా సీపీఎం అంచనా వేస్తుంది. అయితే భద్రాచలం పరిధిలో పార్టీకి పట్టున్న మూడుమండలాలు ఏపీలో కలిపేయడం, మిర్యాలగూడలో ప్రధానపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, ఇబ్రహీంపట్నంలో బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి విజయావకాశాలు ఉండటంతో వీటిలో ఒక్క సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మధిర, నారాయణ్‌పేట్, ఆలేరు, చెన్నూరు, కొత్తగూడెం,మహబూబాబాద్‌ స్థానాలపై బీఎల్‌ఎఫ్‌ ఆశాభావంతో ఉన్నాయి. నారాయణ్‌పేట్‌లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో చివరకు ఎలాంటి ఫలితం వెలువడుతుందన్న ఉత్కంఠ నెలకొంది.  

మరిన్ని వార్తలు

12-12-2018
Dec 12, 2018, 04:19 IST
హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు....
12-12-2018
Dec 12, 2018, 03:52 IST
న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా...
12-12-2018
Dec 12, 2018, 03:34 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొందరు కొత్త రికార్డులు నమోదు చేశారు. పలువురు ఎక్కువసార్లు...
12-12-2018
Dec 12, 2018, 03:28 IST
నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఓటమిపాలైంది. మూడుసార్లు బీజేపీకే పట్టంగట్టిన...
12-12-2018
Dec 12, 2018, 03:27 IST
సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సొంత నియోజకవర్గం సెంటిమెంట్‌ మరోసారి పునరావృతమైంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏ పార్టీ...
12-12-2018
Dec 12, 2018, 03:18 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ ప్రజాకర్షణ శక్తి మంత్రం రాష్ట్రంలో పని చేయలేదు. అమిత్‌షా రాజకీయ చతురతకూ ఇక్కడ స్థానం...
12-12-2018
Dec 12, 2018, 03:12 IST
సాక్షి, హైదరాబాద్‌: భారీ ఆశలు, అంచనాలతో ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న...
12-12-2018
Dec 12, 2018, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి ఓటమికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. భాగస్వామ్యపక్షాల మధ్య పొత్తు...
12-12-2018
Dec 12, 2018, 03:04 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నోటా (నన్‌ ఆఫ్‌ ద అబై వ్‌)కు గణనీయ సం ఖ్యలో ఓట్లు...
12-12-2018
Dec 12, 2018, 02:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి...
12-12-2018
Dec 12, 2018, 02:47 IST
2014 ఎన్నికల్లో గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది.హుజూర్‌నగర్, పాలేరు, ఇల్లందు,...
12-12-2018
Dec 12, 2018, 02:41 IST
సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేటట్లు ఎన్నికల...
12-12-2018
Dec 12, 2018, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొలువుదీరనున్న టీఆర్‌ఎస్‌ కొత్త మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రు లు తుమ్మల...
12-12-2018
Dec 12, 2018, 02:05 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ కూటమి అనే రెండు ఏనుగుల మధ్య నలిగిపోయామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...
12-12-2018
Dec 12, 2018, 01:57 IST
సాక్షి, హైదరాబాద్‌: గత సార్వత్రిక ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో...
12-12-2018
Dec 12, 2018, 01:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తారుమారు చేశారనే అనుమానంతో వీవీ ప్యాట్లతో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ చేయాలని డిమాండ్‌...
12-12-2018
Dec 12, 2018, 01:56 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి...
12-12-2018
Dec 12, 2018, 01:45 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కు అయిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్‌...
12-12-2018
Dec 12, 2018, 01:36 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం తగ్గింది. 2014 ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది విజయం సాధించగా ఈసారి...
12-12-2018
Dec 12, 2018, 01:16 IST
ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీలు మూకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా తనపై తీవ్ర ప్రచారానికి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top