చివరిరోజు ఆమోదించారు

'Chidambaram Blessed Mehul Choksi With New Gold Import Rule in 2013' - Sakshi

ఏడు కంపెనీలకు లాభం చేసేలా నిర్ణయం

2014 లోక్‌సభ ఫలితాలు వెలువడిన రోజే..

దీనివల్ల చిదంబరానికి ఎంత మేలు జరిగింది?

కాంగ్రెస్‌ హయాం అవినీతిపై మండిపడ్డ బీజేపీ  

న్యూఢిల్లీ: 2014లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పలు బిల్లులను ఆమోదించారని బీజేపీ ఆరోపించింది. గీతాంజలి జెమ్స్‌ సహా పలు కంపెనీలకు మేలు చేసేలా బంగారు దిగుమతి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొంది.ఈ నిర్ణయం ద్వారా చిదంబరం ఎంత లాభం పొందారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. విపక్షాలు బీజేపీపై చేస్తున్న అసత్యాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.మొండి బకాయిలు బ్యాంకు పుస్తకాల్లో లేకుండా చేసింది.

ప్రభుత్వం చివరి ఆరేళ్లలో రూ.52.15లక్షల కోట్లను అడ్వాన్స్‌గా కంపెనీలకు ఇచ్చింది. ఇందులో 36 శాతం నిధులు మొండి బకాయీలుగా గుర్తించగా.. అవి ప్రభుత్వం గద్దెదిగే సమయానికి 82 శాతానికి చేరాయి. గొప్ప ఆర్థికవేత్తలైన మన్మోహన్‌ సింగ్, చిదంబరంల హయాంలో అనవసర జోక్యం, మొండి బకాయిలను ప్రోత్సహించటం, ఒత్తిడి చేయటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పట్టాలు తప్పింది’ అని వెల్లడించారు. 80:20 పథకం ద్వారా ఏడు ప్రైవేటు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరిందన్నారు. ‘మే 16న మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఓడిపోయింది. చిదంబరం కుర్చీ ప్రమాదంలో పడింది. చివరి రోజు అత్యవసరంగా ఏడు ప్రైవేటు కంపెనీలకు మేలు చేసేలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో.. చిదంబరం, రాహుల్‌ గాంధీ వెల్లడించాలి’ అని రవిశంకర్‌ చెప్పారు.

పీఏసీకి ‘80:20’ వివరాలు
యూపీఏ హయాంలో తెచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం వివరాలను పార్లమెంటు ప్రజాపద్దుల సంఘానికి (పీఏసీ) ఆర్థిక శాఖ అందజేయనుంది. ఈ పథకంలోని లొసుగులను వినియోగించుకునే గీతాంజలి గ్రూప్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారం టూ పీఏసీలోని బీజేపీ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆర్థిక శాఖ పథకం వివరాలను సేకరిస్తోంది. పథకం, తదనంతర పరిణామాలపై 10 రోజుల్లో పీఏసీకి వివరాలు ఇవ్వనుంది. 80:20 బంగారు దిగు మతి పథకం ప్రకారం.. వ్యాపారస్తులు తా ము గతంలో దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతమైనా ఎగుమతి చేసి ఉంటేనే.. తర్వాత మరోసారి బంగారం దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top