‘రూ.150 కోట్ల స్కామ్‌లో తండ్రీకొడుకులకు వాటా’

Botsa Satyanarayana Alleges Chandrababu And Lokesh Over ESI Scam - Sakshi

చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి బొత్స ఆరోపణలు

సాక్షి, గుంటూరు: ఈఎస్‌ఐ అవినీతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు కూడా వాటా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రూ.150 కోట్ల అవినీతిలో వారికి వాటా ఉన్నందునే అసలు విషయం పక్కనపెట్టి అచ్చెన్నాయుడు అరెస్టు అన్యాయం అని మాట్లాడుతున్నారని విమర్శించారు. అచ్చన్నాయుడును కలవాలంటే ఎవరైనా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే మంత్రి తెలిపారు. అచ్చెన్నాయుడును కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించటం సరికాదని హితవు పలికారు.
(చదవండి: ఈఎస్‌ఐ స్కాం మూలాలపై కన్ను)

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘ఈఎస్‌ఐలో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా? అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అరెస్టు అన్యాయం అని మాట్లాడితే సరిపోతుందా?’ అని బొత్స సూటిగా ప్రశ్నించారు. కాగా, ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.
(చదవండి: అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top