తెలంగాణలో బీజేపీదే అధికారం: పరిపూర్ణానంద

BJP Victory In Telangana, Says Swami Paripoornananda - Sakshi

మూడు ప్రాంతాల్లో మోదీ బహిరంగ సభలు: లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ కురుక్షేత్రం ప్రారంభం అయిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అమిత్‌షా నేతృత్వంలో ఇటీవల బీజేపీలో చేరిన పరిపూర్ణానంద తొలిసారిగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని, ధర్మాన్ని బీజేపీ కాపాడుతున్నందుకే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.

అలాగే కులాలకు, కుటుంబ వారసత్వానికి తావులేకుండా బీజేపీ పని చేస్తోం దన్నారు. మిషన్‌ 70 పేరుతో లక్ష్మణ్‌ నేతృత్వంలో బీజేపీ చక్కగా పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. తనకు పదవులు అక్కర్లేదని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇక్కడ పూర్తయ్యాక మరో రాష్ట్రానికి వెళతానన్నారు. అమిత్‌షా పదవి ఇస్తానన్నా..పదవి కాదు..పని చేస్తానని చెప్పానన్నా రు. తెలంగాణలో జనతా సర్కార్‌ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు అద్వానీ, వాజ్‌పేయి జోడీ పార్టీని నడిపించిందని, ఇప్పుడు అమిత్‌ షా, మోదీ జోడీ పార్టీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువస్తుందన్నారు. పార్టీ అధ్యక్షు డు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల మొద టి విడత ప్రచారంలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని వెల్లడించారు. పరిపూర్ణానంద చేరికను స్వాగతిస్తు న్నామన్నారు. ఆయన చేరికతో ప్రజల నుంచి బీజేపీకి ఎనలేని మద్దతు లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నార న్నారు. అధికారంలోకి వచ్చే వరకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గడ్డం తీయనని అంటున్నారని, అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదని, హిమాలయాలకు వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top