‘అసెంబ్లీ వేదికగా బయటపడ్డ టీడీపీ మోసం’ | BJP Spokesperson Gayathri Slams Chandrababu In Vijayawada | Sakshi
Sakshi News home page

‘అసెంబ్లీ వేదికగా బయటపడ్డ టీడీపీ మోసం’

Sep 9 2018 12:50 PM | Updated on Sep 9 2018 1:00 PM

BJP Spokesperson Gayathri Slams Chandrababu In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చంద్రబాబు మాటలను నమ్మి మహిళలు డ్వాక్రా రుణాలు కట్టడం మానేశారని..

విజయవాడ: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం అసెంబ్లీ వేదికగా బయటపడిందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సి.గాయత్రి ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత మహిళలకు రుణమాఫీ చేయలేదని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని వెల్లడించారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి..వడ్డీలతో కలిపి డ్వాక్రా రుణాలు రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.

చంద్రబాబు మాటలను నమ్మి మహిళలు డ్వాక్రా రుణాలు కట్టడం మానేశారని , ప్రస్తుతం బ్యాంక్‌లు మహిళలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని వ్యాక్యానించారు. బాబు మాటలు నమ్మి రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ మోసపోయారని చెప్పారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement