బీజేపీది నియంత పాలన : సురవరం

BJP Dictator rule : Surajaram - Sakshi

మునుగోడు : ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ బీజేపీ ప్రభుత్వం నియంతపాలన సాగిస్తోందని  సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మునుగోడులోని సత్య పంక్షన్‌హల్‌లో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన ప్రధాని మోదీ వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకుండా కేవలం తన పార్టీ అభివృద్ధి, ప్రతిపక్ష పార్టీల అణచివేతకు మాత్రమే పదవిని వినియోగించుకుంటున్నాడన్నారు.

దేశంలోని ప్రజల బాగోగులు విమస్మిరించి పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ 17 మార్లు పెట్రోల్, డిజీల్‌ ధరలు పెంచారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మా ట్లాడుతూ అనేక త్యాగాలు చేసి తెలంగాణ  ప్రజ లు రాష్ట్రం సాధిస్తే, భోగాలు మాత్రం సీఎం  కేసీ ఆర్‌ కుటుంబం అనుభవిస్తోందన్నారు. తాను అధి కారంలోకి వస్తేఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకపొవడం సిగ్గుచేటన్నారు.

 రా ష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళణతో రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోం దని ఆరోపించారు. ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు,  కార్యవర్గ సభ్యుడు ఉజ్జిని రత్నాకరావు, నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్లానర్సింహారెడ్డి, మందడి నర్సిం హారెడ్డి, కె. లింగయ్య, సురిగి చలపతి, ఎన్‌.రామలింగయ్య, గుండెబోయిన రమేష్, కళ్లెంయాదగిరి, గుర్జ రామచంద్రం, బరిగెల వెంకటేష్, అం జయచారి, తిరిపారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top