‘ప్రకాశ్‌ నీలాంటి వాడు రాజకీయాల్లో చాలా అవసరం’ | Arvind Kejriwal Tweets Need People Like Prakash Raj In Parliament | Sakshi
Sakshi News home page

‘ప్రకాశ్‌ నీలాంటి వాడు రాజకీయాల్లో చాలా అవసరం’

Jan 10 2019 7:21 PM | Updated on Jan 10 2019 7:34 PM

Arvind Kejriwal Tweets Need People Like Prakash Raj In Parliament - Sakshi

న్యూఢిల్లీ : విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ప్రకాశ్‌ రాజ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్య జరిగిన భేటీ కీలకంగా మారింది. ఈ సందర్భంగా పలు  అంశాల గురించి చర్చించినట్లు ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ను కలిసిన విషయం గురించి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ట్వీట్‌ చేశారు.

‘ప్రకాశ్‌ జీ ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. మనం చర్చించిన ప్రతి అంశానికి నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలతో సంబంధంలేని.. స్వతంత్ర అభ్యర్థులు పార్లమెంట్‌లో ఉండటం చాలా అవసరమం’టూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

గౌరీ లంకేష్‌ హత్య అనంతరం ప్రకాశ్‌ రాజ్‌.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారి ప్రకాశ్‌ రాజ్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్‌ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement