చంద్రబాబు గుంట నక్కలా మాట్లాడుతున్నారు

Anil Kumar yadav Fires On Chandrababu Over BC Reservations - Sakshi

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజం

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదు

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను 35 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం బీసీలను వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు. కుళ్లు, కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీ కమిషన్‌ వేస్తానని మోసం చేశారని పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..)

నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని మంత్రి ప్రశంసించారు. కేబినెట్‌లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేశారని, స్థానిక ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు నష్టపోతామని తెలిపారు. (డ్రామాలొద్దు బాబూ)

ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు 59 శాతం రిజర్వేషన్‌ ఇస్తామంటే అడ్డుపడుతున్నారని, బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తితో హైకోర్టులో పిషన్‌ వేయించారని మంత్రి అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు ప్రభుత్వంలో పదవి పొందిన వ్యక్తి అని, బీసీలపై ప్రేమ ఉంది అంటూనే కోర్టులో పిటిషన్లు వేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గుంటనక్కలా మాట్లాడుతున్నారని, బీసీలపై సవితి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో బాబు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను వేశారని, సమయంలో చంద్రబాబు కోర్టుకు 2013 వరకు మాత్రమే పెంచిన రిజర్వేషన్లు పరిమితమని చెప్పారన్నారు. (బడుగుల ద్రోహి చంద్రబాబు)

చదవండి : ఈయన వైఎస్సార్‌సీపీ నాయకుడట!

బాబు వల్లే సీట్ల కోత

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top