మళ్లీ నీ నటనతో నవ్వించు: ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

బాబుమోహన్‌కు ఆ ఆర్హత లేదు: చంటి క్రాంతి కిరణ్‌

Published Wed, Jan 22 2020 8:29 PM

Andole MLA Chanti Kranthi Kiran Slams On Babu Mohan In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: అంధోల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 20 వార్డుల్లో గెలిచి టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటుదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని అంధోల్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓటర్లు ఆదరించారన్నారు. గత పాలకుల పని తీరుకు విసిగిపోయిన ప్రజలు ఈసారి తమ ఓటు బలంతో అంధోల్‌ను అభివృద్ధి పరుచుకున్నారన్నారు. అంధోల్‌ను భ్రష్టు పట్టించిన మాజీ మంత్రి బాబుమోహన్‌కు టీఆర్‌ఎస్‌ నేతలపై మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ అని విమర్శించారు. అంధోల్‌ అభివృద్ధికి అడ్డుపడ్డ బాబుమోహన్‌, ఆర్థిక మంత్రి హరీష్‌ రావును విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇక సినిమాలో నవ్వించిన ఆయన మళ్లీ ఆ రంగంలో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టమని, సేద తీరే సమయంలో ఆయన నటన చూసి నవ్వుకుంటామని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement