‘నా అభిమానులంతా బీజేపీలో చేరండి’ | All Of my Fans To join In BJP Krishnam Raju Says | Sakshi
Sakshi News home page

‘నా అభిమానులందరూ బీజేపీలో చేరండి’

Jul 7 2019 1:00 PM | Updated on Jul 7 2019 4:12 PM

All Of my Fans To join In BJP Krishnam Raju Says - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల ప్రపంచ దేశాలు అన్ని భారతదేశం వైపు చూస్తున్నాయని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి మాణిక్యాలరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబెట్టాడని కొనియాడారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం తన అభిమానులు అందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. గతంలో బీజేపీని ఒక వర్గానికి చెందిన పార్టీగా ముద్రవేశారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోదీ సాధించిన విజయంతో బీజేపీ అన్ని వర్గాల పార్టీగా అవతరించిందన్నారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారికి తమ పార్టీలో ఉన్నతమైన పదవులు లభించాయన్నారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీయే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement