పాత్రికేయుడు కృష్ణంరాజు అరెస్టు | Journalist Krishnam Raju arrested | Sakshi
Sakshi News home page

పాత్రికేయుడు కృష్ణంరాజు అరెస్టు

Jun 12 2025 4:31 AM | Updated on Jun 12 2025 4:31 AM

Journalist Krishnam Raju arrested

సాక్షి, అమరావతి:  సీనియర్‌ పాత్రికేయుడు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రే అదుపులోకి తీసుకున్న అయనను ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో పాటు సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ‘సాక్షి’ టీవీ యాజమాన్యంపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో ఇప్పటికే కొమ్మినేనిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కృష్ణంరాజు అరెస్టును గురువారం అధికారికంగా వెల్లడించి అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై పోలీసు వర్గాలు అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement