కూటమి కూర్పు : దీదీతో అఖిలేష్‌ మంతనాలు

Akhilesh Yadav Discusses Possible Post Poll Scenarios With Mamata Banerjee - Sakshi

లక్నో : ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయేకు భారీ ఆధిక్యతను కట్టబెట్టడంతో విపక్షం అప్రమత్తమైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అవలంభించాల్సిన ఉమ్మడి వ్యూహంపై కసరత్తును వేగవంతం చేసింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌లు ఈ దిశగా సోమవారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. హంగ్‌ పార్లమెంట్‌ వస్తే బీజేపీయేతర పార్టీలను కలుపుకునివెళ్లడంపైనా వీరు చర్చించినట్టు తెలిసింది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం భావసారూప్య పార్టీలను ఏకతాటిపైకి తేవడంతో పాటు పరిస్థితులకు తగిన విధంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు సంప్రదింపులు జరిపారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించిన తీరును ఈ సందర్భంగా దీదీకి అఖిలేష్‌ యాదవ్‌ వివరించినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ఏర్పాటుపై వేగంగా స్పందించడంపైనా వారు చర్చించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top