‘కేటీఆర్‌కు వాళ్ల సమస్య కనిపించడం లేదా’

AICC Sampath Kumar: Government Negligence On Redgram Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. కంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంది రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సూచించారు. టమాటా పండించిన రైతు పరిస్థితి కూడా చాలా దయనీయంగా  ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌లో కంది కొనుగోలుకు పరిమితులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తేయాలని, టమాటాకు మద్దతు ధర కల్పించాలని కోరారు. (ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్‌ అధికారిణి)

అదే విధంగా గిట్టుబాటు ధరను కల్పించడంలో, విత్తన సబ్సిడీ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే వ్యవసాయ పనిముట్ల సబ్సిడీని సైతం కేసీఆర్ సర్కార్ ఎత్తేసిందని మండిపడ్డారు. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ అంటే కేసీఆర్ సర్కార్ కు గుర్తుకొచ్చేది కేవలం ట్రాక్టర్లు మాత్రమేనని, ట్రాక్టర్లు ఇస్తే కమీషన్లు వస్తాయనే వాటిపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై ట్విట్టర్ లోనైనా స్పందిస్తాడో ఏమోనని  ట్విట్‌ చేసినా పట్టించుకోలేదన్నారు.  ఈటెల రాజేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కోసం చికెన్  కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్‌కు  రైతు సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. (జనరల్‌ మేనేజర్‌పై పగబట్టిన మేనేజర్‌ )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top