తెలుగుతల్లికి ఉద్యమ హారతి | 'Save Andhra Pradesh' meeting in vijayawada | Sakshi
Sakshi News home page

తెలుగుతల్లికి ఉద్యమ హారతి

Sep 21 2013 5:14 PM | Updated on Sep 1 2017 10:55 PM

స్వరాజ్య మైదానంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరైన జనసందోహం

 వరద ఉధృతిని తలదన్నిన ఉద్యమ ఉరవడికి కృష్ణమ్మ చిన్నబోయింది.. మహిషాసుర మర్దనం కంటే ముందుగానే విభజనాసురుల సంహారానికి కదంతొక్కిన సమైక్యశ్రేణుల ధర్మాగ్రహాన్ని చూసి దుర్గమ్మ విస్తుబోయింది.. స్వరాజ్య మైదానం మరో స్వతంత్ర పోరాట పతాకైంది. తెలుగుతల్లిని చెరబట్టిన నిజాంను తరిమికొట్టే యుద్ధతంత్రాలకు, గెరిల్లా దళాల శిక్షణకు నాడు కేంద్రమైన బెజవాడ.. ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చే సోనియా, కేసీఆర్ దుష్టద్వయ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టే నేటి కురుక్షేత్ర మహాసంగ్రామానికి కమ్యూనిస్టు రుషి సుందరయ్య వేదిక నుంచి పాంచజన్యం పూరించింది.
       స్వరాజ్య మైదానంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరైన జనసందోహం

   వెల్లువలా.. : బైక్ ర్యాలీగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్తున్న సమైక్యవాదులు

   సేవ్ ఆంధ్రప్రదేశ్.. అంటూ మహిళాలోకం కదం తొక్కింది.

   సమైక్య నినాదం : జై సమైక్యాంధ్ర అంటున్న మహిళలు
    విన్యాసం : సభావేదికపై సాంస్కృతిక ప్రదర్శన

  తెలుగుతల్లికి నృత్య నీరాజనం : వేదికపై చిన్నారుల నృత్య ప్రదర్శన

  నారీభేరి : సభకు హాజరైన మహిళల సమైక్య నినాదాలు

 

Advertisement
 
Advertisement
Advertisement