ఇదేం ఇండియా! | man booker prizes winner marlon james point outs his pains in indian | Sakshi
Sakshi News home page

ఇదేం ఇండియా!

Jan 24 2016 11:10 PM | Updated on Sep 3 2017 4:10 PM

ఇదేం ఇండియా!

ఇదేం ఇండియా!

ఇండియాలో దిగితే ఇన్ని ఇబ్బందులా బాబూ! అంటున్నాడు మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత మార్లోన్ జేమ్స్.

ఇండియాలో దిగితే ఇన్ని ఇబ్బందులా బాబూ! అంటున్నాడు మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత మార్లోన్ జేమ్స్. ఈ జమైకా రచయిత జైపూర్ సాహిత్యోత్స వానికి వచ్చారు. జేమ్స్, బ్రిటిష్ రచయిత ప్యాట్రిక్ ఫ్రెంచ్‌లతో కలిపి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తే, అందులో తను పడిన బాధలన్నీ వివరించాడాయన.

 

ఢిల్లీలో దిగగానే అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి, దేశీయ విమానాలు వచ్చి పోయే విమానాశ్రయానికి వెళ్లడానికి తల ప్రాణం తొకకు వచ్చిందని జేమ్స్ తిట్టి పోశాడు. ఆ రెండు విమానాశ్రయాల మధ్య ప్రయాణం పెట్టిన ఇక్కట్లకు తోడు ఒక విమానం ఆలస్యంగా ప్రయాణించి మరింత విసుగును కలిగించిందని చెప్పా రాయన. ఇదేం ఇన్‌క్రెడిబుల్ ఇండియా అని కూడా వాపోయాడు.

 

ఈ వివాదం గురించి జేమ్స్ పుస్తకాలు అచ్చువేసే సంస్థ ఏమీ మాట్లాడలేదు. ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ అనే ఆయన నవలకు నిరుడు బుకర్ పురస్కారం వచ్చింది. జేమ్స్ గారూ ఇలాంటి ఇబ్బందులు ప్రపం చంలో ఎక్కడైనా ఉంటాయని వెంటనే ట్వీట్‌లు మొదలైనాయి. భారతదేశం ఇప్పుడు ఎవరు వచ్చినా అసహనంతోనే ఉంటారు కాబోలు.

Advertisement

పోల్

Advertisement