
ఇందిరాగాంధీతో కేఎల్ రావు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయినిగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కారణం కానూరు లక్ష్మణరావు అనే ఒక్క వ్యక్తి పట్టుదలే. ‘
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయినిగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కారణం కానూరు లక్ష్మణరావు అనే ఒక్క వ్యక్తి పట్టుదలే. ‘నీవు లే కుంటే ఈ ప్రాజెక్టు చెత్తబు ట్టకు దఖలయ్యేదే’ అని ఒకప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూయే ఆయనతో అన్నారు. మన దేశపు అత్యుత్తమ ఇంజనీ ర్లలో ఒకరైన ఆయన డాక్టర్ కేఎల్ రావుగా సుప్రసి ద్ధులు. ఆయన 1902, జులై 15న కృష్ణాజిల్లా కంకిపా డులో జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక విశా ఖపట్నంలోనూ, విజయనగరం సంస్థానంలోనూ అసిస్టెంట్ ఇంజనీర్‌గా, ఆ తదుపరి పీడబ్ల్యూడీ ఆధీ నంలోని మెట్టూర్ ప్రాజెక్టులో జూనియర్ ఇంజనీ ర్‌గా విధులను నిర్వర్తించారు.
ఆ తర్వాత ఆయన సిమెంట్ కాంక్రీట్‌పై పరిశోధనలు చేశారు. రీయిన్ ఫోర్స్‌డ్ కాంక్రీట్ గురించి ఫ్రాన్స్‌లో అధ్యయనానికి వెళ్లి, 1939 నుంచి రెండేళ్లు లండన్‌లో పనిచేశారు. అమెరికాలో అధ్యాపకునిగా పనిచేస్తుండగా కేఎల్ రావును నాటి మద్రాసు ప్రభుత్వ సలహాదారు సర్ రామమూర్తి భారతదేశం వచ్చి శ్రీరామపాద సాగర్ (పోలవరం) ప్రాజెక్టు నిర్మా ణానికి చర్యలు తీసుకోవాలని కోరా రు. దీంతో 1946లో స్వదేశం తిరిగి వచ్చారు. మద్రాస్ ప్రభుత్వ డిజైన్ ఇంజనీర్‌గా చేరారు. 1947 మొద టికి కాంక్రీట్ సాయిల్, హైడ్రాలిక్ మోడల్స్‌లో డ్యామ్ డిజైన్లు రూపొందించారు. కానీ రాజకీయ కారణాలతో నాడు పోలవరం ప్రాజెక్టు డిజైన్లు అటకెక్కాయి. ఆ తర్వాత ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ డిజైన్స్ డెరైక్టర్‌గామహానదిపై హీరా కుడ్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించారు.
స్వాతంత్య్రానంతరం కృష్ణా, గోదావరి బేసిన్‌ల అభివృద్ధి గురించి కేఎల్‌రావు అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణానదికి ఎడమవైపున ఉన్న నంది కొండ వద్ద (నాగార్జునసాగర్) డ్యామ్ కట్టవచ్చని గుర్తించారు. నాటి హైదరాబాద్ రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టు ఉప యోకరమని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు చెప్పి ఒప్పించారు. మద్రాసు ప్రభుత్వం మోకాలడ్డ చూసినా కేఎల్ రావు కృషి ఫలితంగా ఖోస్లా కమిటీ, ప్రణాళికా సంఘాలు నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకా రం తెలిపాయి. నాగార్జునుని అవ శేషాలను మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరచేలా పండిట్ నెహ్రూ నుంచి హామీ పొందారు. నాగా ర్జునసాగర్ పనులకు కేఎల్ రావే స్వయంగా నేతృ త్వం వహించారు. 1967లో పూర్తయిన ఆ ప్రాజెక్టు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 22,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, తాగునీరు అందిస్తోంది. 820 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతోంది.
ఆ తర్వాత కృష్ణా నదిపై జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై కేఎల్ రావు ప్రత్యేక అధ్యయనం చేశారు. వాటిలో ముఖ్య మైనది శ్రీశైలం ప్రాజెక్టు. ఆయన ప్రతిపాదనకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కేఎల్ రావు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. 1963లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాజకీ యాల్లో కూడా కేఎల్ రావు రాణించారు. 1962 ఎన్నికల్లో విజయ వాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
ఎంపీగా ఆయన కృష్ణా జల వివాదాలపై ఏర్పాటైన కమిటీలో సభ్యు నిగా ఉన్నారు. 1963లో పండిట్ నెహ్రూ మంత్రి వర్గంలో జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రిగా నూ, ఆ తర్వాత లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిరా గాంధీ మంత్రి వర్గాల్లోనూ పనిచేశారు. దేశానికి, రాష్ట్రానికి, డెల్టా రైతాంగానికి అమూల్యమైన సేవలు అందించిన డాక్టర్ కేఎల్ రావు 1986, మే 18వ తేదీన కన్నుమూశారు. పరిశోధకుడిగా, అధ్యాపకు డిగా, ఇంజనీర్‌గా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కేఎల్‌రావును భావి ఇంజనీర్లు, విద్యార్థులు, రాజ కీయ నాయకులకు ఆదర్శం.
(నేడు డాక్టర్ కేఎల్ రావు జయంతి)
(వ్యాసకర్త ఏపీసీసీ అధికార ప్రతినిధి,
కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్
- కొలనుకొండ శివాజీ