
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఉదయం 10 గంటల వరకు రాలేదు. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్టుకు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో తన పర్యటన రద్దు చేసుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచే అలిగి వెళ్లిపోయారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్‌కు హెలికాప్టర్‌లో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ వెళ్లిపోయారు.