భూములిచ్చిన రైతులకు శఠగోపం | Farmers to give lands of land pooling | Sakshi
Sakshi News home page

భూములిచ్చిన రైతులకు శఠగోపం

May 27 2015 12:23 AM | Updated on Jul 28 2018 4:24 PM

‘రాజధాని’ కోసం భూములను ‘దానం’ ఇవ్వని రైతులను భయపెట్టడం కోసం 2015 మే నెల 15వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం 166 జీవో జారీ చేసింది.

‘రాజధాని’ కోసం భూములను ‘దానం’ ఇవ్వని రైతులను భయపెట్టడం కోసం 2015 మే నెల 15వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం 166 జీవో జారీ చేసింది. అయితే 166 జీవోకు, కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌కు మధ్య పొంతన కుదరని కొన్ని అంశాలున్నాయి. నోటిఫికేషన్ (జీవో) విడుదల చేయటానికి ముందే రాష్ర్ట ప్రభుత్వం బీడు భూముల సర్వే నిర్వహించాలనీ, కనిష్టంగా అవసరమైన భూమిని మాత్రమే సేకరించాలనీ కేంద్ర ఆర్డినెన్స్ పేర్కొంది. ఈ రెండూ జరగలేదు. దీంతో జీవో 166 చెల్ల్లుబాటు కాదు. ల్యాండ్ పూలింగ్‌లో ఎకరం భూమిచ్చిన రైతుకు అభివృద్ధి చేసిన 1200 గజాల భూమినిస్తామనీ దాన్ని అధిక ధరకు తమకు నచ్చినట్లు అమ్ముకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వం నమ్మబలికింది.
 
 కానీ కేంద్ర ఆర్డినెన్స్ పీపీపీ ప్రాజెక్టుల్లో అనంతరం కూడా భూమిపై ప్రభుత్వ హక్కు కొనసాగాలని పేర్కొంది. దీంతో పూలింగ్ ద్వారా ప్రతిఫలంగా పొందిన భూమిపై రైతుకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కు గాలిలో దీపమే. ల్యాండ్ పూలింగ్‌కు ప్రతిఫలంగా వచ్చే భూమిపై సకల హక్కులు ఆ భూమినిచ్చిన రైతుకు దక్కే విషయంలోనూ నీలినీడలే. ఏదైనా కేంద్ర చట్టం లేదా నిబంధనకు, రాష్ర్ట చట్టం నిబంధనకు మధ్య వైరుధ్యం తలెత్తితే కేంద్రానిదే వర్తిస్తుంది. దీంతో జీవో 166 ప్రకారం భూసేకరణ ప్రక్రియను చేపడితే పూలిం గ్‌ను వ్యతిరేకించే రైతుల భూములను గుంజుకోవడం మాట అటుంచితే ఇప్పటికే పూలిం గ్‌కు సమ్మతి పత్రాలిచ్చిన ైరైతుల హక్కులపట్ల సందేహాలు పెరుగుతున్నాయి. పూలింగ్‌ను వ్యతిరేకించే వారి భూములనే సేకరిస్తామని మంత్రులు చెబుతున్నా జీవో 166లో మాత్రం యావత్ రాజధాని ప్రాంతాన్నీ నోటిఫై చేశారు. 166-జీవోతో ప్రతికూల ఫలితాలేమైనా ఉంటే అవి అందరు రైతులకూ వర్తించే ప్రమాదముంది.
 - రాజశంకర్  హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement