ఎన్నికలు, లాబీయింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని, దాన్ని పోరాటాల ద్వారానే సాధించుకోగలమనే నినాదంతో 2006 అక్టోబర్ 26న హైదరాబాద్‌లో 40 మంది విద్యార్థులతో తెలంగాణ విద్యార్థి వేదిక (టి.వి.వి) ఏర్పడింది.
ఎన్నికలు, లాబీయింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని, దాన్ని పోరాటాల ద్వారానే సాధించుకోగలమనే నినాదంతో 2006 అక్టోబర్ 26న హైదరాబాద్‌లో 40 మంది విద్యార్థులతో తెలంగాణ విద్యార్థి వేదిక (టి.వి.వి) ఏర్పడింది. బలమైన ప్రజా ఉద్యమం లేని సంక్షోభ సమయంలో ఆవిర్భవించిన టీవీవీ పది జిల్లాల్లో కమిటీలు ఏర్పర్చుకుని నిర్మాణాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో భాగమైంది. 1969, 1996, 2009 చారిత్రక ఘట్టాలు ప్రత్యేక తెలంగాణ పోరాటానికి నాందీవాచకం పలికాయి. ప్రతి చారిత్రక సందర్భంలో విద్యార్థులే నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపారు. అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
అయితే వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం భౌగోళికమైనదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రంగా మారాల్సివుంది. అప్పుడు మాత్రమే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. టి.వి.వి ప్రజా స్వామిక తెలంగాణే తన ధ్యేయంగా పనిచేస్తోంది. భారత రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కు, ఉపాధి, భూమి హక్కు, వాక్, సభా స్వాతం త్య్రాలు వంటి హక్కులు పూర్తిగా అమలు కావడమే ప్రజాస్వామిక తెలంగాణ. నూతన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావాలన్నదే టి.వి.వి ఆశయం. దానికోసం పోరాడటమే మన కర్తవ్యం. భౌగోళిక తెలంగాణ సాకారమైన ఈ ఆరునెలల కాలంలో టీఆరెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేసిన సందర్భం లేదు.
విద్యార్థులపై లాఠీచార్జి, రైతులపై పోలీసుల దాడి, సభలు పెట్టుకునే హక్కు ను కాలరాయడం, రైతుల ఆత్మహత్యలను పెడచెవిన పెట్టడం, కార్పొ రేట్ శక్తులకు ఎర్రతివాచీ పర్చడం, వృద్ధుల, వితంతువుల, వికలాం గుల పెన్షన్‌కు కోత, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు వరుసగా జరుగు తున్నాయి. అందుకే త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం విద్యార్థులే మళ్లీ పోరాటానికి సిద్ధం కావాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్పుడల్లా 1936లో నైజాంకు, 69లో కాసు బ్రహ్మానందరెడ్డికి, 74లో ఎమర్జెన్సీకి, 85లో ఎన్టీరామారావుకు, 92లో ఎన్. జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులే పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. నేటి నుంచి టి.వి.వి 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా అందరం ఏకమై బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి మన హక్కులను సాధిం చుకోవాలి. హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాల కోసం, పెండింగ్ స్కాలర్ షిప్స్ కోసం, ప్రభుత్వ విద్యాలయాల రక్షణ కోసం, విద్యా ప్రైవేటీక రణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ మహా సభల సందర్భంగా ప్రతిన పూనుదాం.
(జనవరి 29-30 తేదీల్లో నల్లగొండలో టి.వి.వి రాష్ట్ర 4వ మహాసభలు)
- డి. విజయ్ అధ్యక్షులు, తెలంగాణ విద్యార్థి వేదిక