లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు | YSR 70th Birth Anniversary Celebrations In London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Jul 8 2019 4:36 PM | Updated on Jul 8 2019 6:26 PM

YSR 70th Birth Anniversary Celebrations In London - Sakshi

లండన్‌ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు సోమవారం లండన్ లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ యూకే అండ్‌ యూరప్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్ పర్యటనలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విభాగం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ యూకే అండ్‌ యూరప్‌ వింగ్‌ కన్వీనర్‌ సందీప్‌ రెడ్డి వంగల, పీసీ రావ్‌, ప్రదీప్‌ కత్తి, మన్మోహన్‌ రెడ్డి, అమరనాథ్‌ కల్లం, రవీంద్రారెడ్డి, ఎన్‌ఆర్‌ రెడ్డిలతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement