హైదరాబాద్‌కు రవీందర్‌ మృతదేహం

NRI Dead Body Reached To Home - Sakshi

శాయంపేట(భూపాలపల్లి) : పొట్టకూటి కోసం మలేషియాకు వెళ్లి మృత్యువాత పడిన గట్టు రవీందర్‌(42) మృతదేహం స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, మలేషియాలోని తెలుగు ఎన్నారైల సంఘం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ప్రత్యేక చొరవతో శుక్రవారం రాత్రి 11.30కు హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శాయంపేటకు చెందిన గట్టు రవీందర్‌(42) అక్కడ ఐస్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీకై ఊపిరాడక ఈ నెల 13 ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే.

గీతకార్మికుడైన రవీందర్‌ కుటుంబ పోషణ నిమిత్తం 2013 సెప్టెంబర్‌లో మలేషియాకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. 5 రోజులుగా రవీందర్‌ మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్పీకర్‌ మధుసూదనాచారి సాయంతో చిట్టిబాబు ఐస్‌ కంపెనీ యజమానులతో మాట్లాడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున మృతదేహం శాయంపేటకు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top